కృష్ణా జిల్లా విజయవాడలో శ్రీలంక దేశస్థుడు స్టీవెన్ రత్నాయక్ అదృశ్యం కలకలం రేపింది. గత పదిహేను రోజులుగా అతడి ఆచూకీ తెలియకుండా పోయింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీలంకకు చెందిన రత్నాయక్ అక్టోబర్ 15న ఉదయం 11 గంటలకు తమిళనాడు ఎక్స్ ప్రెస్ రైలులో చెన్నై నుంచి హైదరాబాద్ కు బయలుదేరాడు. ఈ క్రమంలో విజయవాడ రైల్వేస్టేషన్లో అతడు అదృశ్యమయ్యాడు.