సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలో బహిరంగసభలు నిర్వహించిన సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ అహంకారంతో మాట్లాడుతున్నారని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.