సల్మాన్ ఖాన్కు మధ్యంతర బెయిల్ | salman-khan-granted-2-days-interim-bail | Sakshi
Sakshi News home page

May 6 2015 5:15 PM | Updated on Mar 22 2024 11:05 AM

టాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు ముంబై హైకోర్టు రెండు రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. దీంతో సల్మాన్ ఖాన్ రాత్రికి జైలులో ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. 2002 నాటి హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్కు 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ముంబై సెషన్స్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. దాంతో ఆయన్నీ ముంబై ఆర్థర్ రోడ్డులోని జైలుకు తరలించారు. సల్మాన్కు బెయిల్ కోసం ఆయన తరపు న్యాయవాదులు వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. సల్మాన్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని.... ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే హైకోర్టుకు విన్నవించారు. దీంతో సల్మాన్కు రెండు రోజు పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement