తరగతి గదిలో తోటి స్నేహితులను ఆటపట్టించడం మామూలే. అయితే.. అది కొంతవరకు మాత్రమే. శ్రుతి మించితే అవతలి వాళ్లకు చిర్రెత్తుకొస్తుంది. రష్యాలో సరిగ్గా ఇలాగే జరిగింది. ఓ అమ్మాయికి ఎదురైన చేదు అనుభవం కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రష్యాలోని ఇర్కుట్స్క్ నగరంలో ఓ స్కూలు బ్రేక్ సమయంలో మారియా అనే 15 ఏళ్ల అమ్మాయి తన స్నేహితుడిని ఏడిపించాలని అనుకుంది.