breaking news
Russian school
-
సరసం కాస్తా విరసమైతే..
తరగతి గదిలో తోటి స్నేహితులను ఆటపట్టించడం మామూలే. అయితే.. అది కొంతవరకు మాత్రమే. శ్రుతి మించితే అవతలి వాళ్లకు చిర్రెత్తుకొస్తుంది. రష్యాలో సరిగ్గా ఇలాగే జరిగింది. ఓ అమ్మాయికి ఎదురైన చేదు అనుభవం కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రష్యాలోని ఇర్కుట్స్క్ నగరంలో ఓ స్కూలు బ్రేక్ సమయంలో మారియా అనే 15 ఏళ్ల అమ్మాయి తన స్నేహితుడిని ఏడిపించాలని అనుకుంది. అందుకోసం ఆమె ఓ గ్లాసుడు నీళ్లు తీసుకుని అతగాడి మీద పోసింది. ఆర్టెమ్ అనే ఆ కుర్రాడికి ఆ ఘటనతో ఎక్కడలేని కోపం వచ్చింది. ఒక్కసారిగా ఆమెను అవతలకు తోసి.. తలమీద, ముఖం మీద పిడికిలితో ముష్టిఘాతాలు మొదలుపెట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు.. మిగిలిన పిల్లలు పట్టుకుని ఆపేవరకు ఏకంగా పది గుద్దులు గుద్దాడు. వాళ్లంతా పట్టుకున్నా కూడా ఒకటి రెండుసార్లు కొట్టబోయాడు. అంత కోపం వచ్చింది మరా పిల్లాడికి. సరదాకు చేసిన పని కాస్తా ఇలా విరసంగా మారడంతో పాపం ఆ అమ్మాయి నేలమీద కూర్చుని రెండు చేతుల్లో తల దాచుకుని ఏడ్చింది. ఈ దాడి మొత్తాన్ని ఓ విద్యార్థి తన స్మార్ట్ఫోన్లో షూట్ చేశాడు. వెంటనే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో అది వైరల్గా మారింది. కొసమెరుపు: కథ అక్కడితో అయిపోలేదు. మారియా స్నేహితులు ఐదుగురు కలిసి స్కూలు అయిపోయిన తర్వాత ఆ కుర్రాడిని కుమ్మేశారు. స్కూలు వెనకాల అతడిని పట్టుకుని, గ్రౌండులోకి తీసుకెళ్లి చితక్కొట్టారు. స్కూలు సెక్యూరిటీ గార్డు చూసి వాళ్లను ఆపాడు. అయితే, అతగాడు చేసిన పనికి ఈమాత్రం పడాల్సిందేనని సదరు గార్డుకూడా అన్నాడట! -
సరసం కాస్తా విరసమైతే..
-
టీచర్ను గన్తో కాల్సిన టెన్త్ విద్యార్ధి
-
పాఠశాలలో ముందుపాతరలు ఉన్నాయంటూ నకిలీ ఫోన్
రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలోని ఓ పాఠశాల అవరణలో మందుపాతరలు అమర్చినట్లు ఫోన్ కాల్ రావడంతో పాఠశాల యాజమాన్యం అప్రమత్తమైంది. పోలీసులకు సమాచారం అందించింది. దాంతో హుటాహుటన పోలీసులు పాఠశాలకు చేరుకుని, పాఠశాలలోని విద్యార్థులతోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 400 మందిని అక్కడి నుంచి తరలించింది. అనంతరం బాంబు నిర్వీర్య బృందాలు పాఠశాలలో అడుగడుగున క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టింది. దాదాపు మధ్యాహ్నం 1.30లకు వరకు పాఠశాలలో తనిఖీలు నిర్వహించి మందుపాతరలు లేవని బాంబు నిర్వీర్య బృందాలు నిర్థారణకు వచ్చాయి. దాంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. నకిలీ ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఫోన్ కాల్ గుర్తించవలసి ఉందని, దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆ ఘటన గురువారం చోటు చేసుకుంది.