రిషితేశ్వరి మృతిపై బుధవారం విచారణ ప్రారంభమైంది. ఈ విచారణలో భాగంగా నలుగురు సభ్యులతో కూడిన ప్రభుత్వ విచారణ కమిటీ నాగార్జున వర్సిటీకి చేరుకుంది. మూడు రోజుల పాటు యూనివర్సిటీలోనే ఉండి విచారణ జరపనున్నారు. అయితే ఈ రోజు పూర్తిగా అధికారులతోనే కమిటీ సభ్యులు సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది. రిషితేశ్వరి ఘటన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న దానిపై విచారణ జరుపుతున్నామని విచారణ కమిటీ సభ్యుడు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. పోలీసులు, విద్యార్థులు, విద్యార్థి నేతలతో కూడా తామ ప్రత్యేక్యంగా మాట్లాడుతామన్నారు. ఎవరైనా బహిరంగంగా విచారణకు హాజరైనాసరే లేదంటే ఇన్కెమెరా విచారణకు హాజరవుతామని తెలిపినా అభ్యంతరం లేదని చెప్పారు. ఈ రోజంతా వర్సిటీ అధికారులతో మాట్లాడి రేపు విద్యార్థులతో విచారణ జరుపుతామని అన్నారు. మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చేవారికి తమ మెయిల్ అడ్రస్ చెబుతామని తెలిపారు. కాగా, ఐదురోజుల్లో తాము ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉందని బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రిషితేశ్వరి మృతిపై విచారణ ప్రారంభమైన నేపథ్యంలో మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించడం లేదని సమాచారం
Jul 29 2015 1:17 PM | Updated on Mar 20 2024 3:53 PM
Advertisement
Advertisement
Advertisement
