37 సార్లు సూపర్‌ హిట్‌ 'పీఎస్‌ఎల్‌వీ' | PSLV-C36 Successfully Launches Resource sat -2A; ISRO | Sakshi
Sakshi News home page

Dec 8 2016 7:18 AM | Updated on Mar 21 2024 6:42 PM

36 గంటల కౌంట్‌డౌన్ అనంతరం.. 44.4 మీటర్లు ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ సీ36 రాకెట్ ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల, కోర్ అలోన్ దశ సాయంతో సరిగ్గా 10.24 గంటలకు ఎరుపు, నారింజ రంగుల నిప్పులు చిమ్ముకుంటూ నింగికి పయనమైంది. ప్రయోగం ప్రారంభమైన సమయం నుంచి ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 73.2 టన్నుల ఘన ఇంధనంతో పాటు కోర్‌అలోన్ దశలో నింపిన 138.2 టన్నుల ఘన ఇంధనం సాయంతో 110.1 సెకన్లకు మొదటిదశను పూర్తి విజయవంతంగా పూర్తి చేశారు. ఆ తరువాత 41.7 టన్నుల ద్రవ ఇంధనంతో 261.4 సెకన్లకు రెండోదశ, 7.65 టన్నుల ఘన ఇంధనంతో 523.8 సెకన్లకు మూడోదశ, 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 1015 సెకన్లకు నాలుగోదశను దిగ్విజయంగా పూర్తి చేశారు. అనంతరం నాలుగోదశ అనంతరం రాకెట్ పై భాగంలో అమర్చిన రిసోర్స్‌శాట్-2ఏను కక్ష్యలో ప్రవేశపెట్టారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement