లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీకి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఎన్నికల విధులతో సంబంధం ఉన్న ఉద్యోగులు, అధికారులు ఒకే చోట మూడేళ్లుగా పనిచేస్తున్న పక్షంలో అలాంటివారిని గుర్తించి మరో చోటుకు బదిలీ చేయనున్నారు. దీనికి సంబంధించి గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.ఎస్. మహంతి వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీకు ఆదేశాలు జారీ చేశారు.