breaking news
PS Mahanthi
-
మూడేళ్లు దాటితే బదిలీ
-
మూడేళ్లు దాటితే బదిలీ
సాక్షి, హైదరాబాద్: లోక్సభకు, రాష్ట్ర అసెంబ్లీకి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఎన్నికల విధులతో సంబంధం ఉన్న ఉద్యోగులు, అధికారులు ఒకే చోట మూడేళ్లుగా పనిచేస్తున్న పక్షంలో అలాంటివారిని గుర్తించి మరో చోటుకు బదిలీ చేయనున్నారు. దీనికి సంబంధించి గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.ఎస్. మహంతి వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీకు ఆదేశాలు జారీ చేశారు. బదిలీల విషయంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా పాటించాలని, ఉల్లంఘిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బదిలీలపై ఇవీ ఉత్తర్వులు... సంబంధిత ఉద్యోగులు, అధికారులను గుర్తించి వచ్చేనెల 10వ తేదీలోగా ఇతర జిల్లాలకు బదిలీ చేయాలి. డిప్యూటీకలెక్టర్లు, జిల్లామెజిస్ట్రేట్లు, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్లు, జిల్లా ఎన్నికల అధికారి, డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులను వారి సొంత జిల్లాలనుంచి ఇతర జిల్లాలకు బదిలీ చేస్తారు. పోలీసు శాఖలో కూడా ఐజీ, డీఐజీ, రాష్ట్ర సాయుధ పోలీసు కమాండెంట్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, సబ్ డివిజినల్ అధికారులను కూడా మూడేళ్లు దాటితే బదిలీ చేస్తారు. ఎస్ఐలు కూడా మూడేళ్ల నుంచి సొంత నియోజకవర్గంలో ఒకే చోట పనిచేస్తుంటే మరో అసెంబ్లీ నియోజకవర్గానికి బదిలీ అవుతారు. గత ఎన్నికల్లో కమిషన్ క్రమశిక్షణ చర్యలకు ఆదేశించిన అధికారులు, ఉద్యోగులను ఎన్నికల విధుల్లో నియమించరాదు. క్రిమినల్ కేసులు, న్యాయస్థానాల్లో కేసులను ఎదుర్కొంటున్న అధికారులు, ఉద్యోగులను కూడా విధుల్లో నియమించరాదు. -
ఏపీఎన్జీఓలతో పిఎస్ చర్చలు విఫలం
హైదరాబాద్: ఏపీఎన్జీఓ నేతలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(పిఎస్) పీకే మహంతి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమ్మె విరమించాలని మహంతి ఉద్యోగులను కోరారు. సమ్మె విరమించేదిలేదని ఉద్యోగ సంఘాల నేతలు తెగేసి చెప్పారు. రాష్ట్ర విభజన ప్రతిపాదనకు నిరసనగా ఏపీఎన్జీఓలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సమైక్యంపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు, ఎంత కాలమైనా సమ్మె కొనసాగించడానికి సిద్దంగా ఉన్నట్లు ఏపీఎన్జీఓలు నిన్ననే ప్రకటించారు.