రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దక్షిణాది రాష్ట్రాల శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 22న హైదరాబాద్ రానున్నారు. 22 నుంచి 31 వరకు ఆయన సికింద్రాబాద్ బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. వారం రోజుల పాటు రాష్ట్రపతి ఇక్కణ్నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారు. దక్షిణాది రాష్ట్రాల పర్యటనలకు వెళ్లడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ముందస్తు అనుమతితో వివిధ రంగాల ప్రముఖులు, రాజకీయ నేతలు రాష్ట్రపతిని కలుసుకుంటారు. రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన ఖరారైనట్లు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం చేరవేశారుు. 22న సాయంత్రం 5.30కు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు.