తనను కుట్రపూరితంగా ఇరికించి మంత్రి పదవి నుంచి తొలగించారని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత సందీప్ కుమార్ ఆరోపించారు. దళితుడిని కాబట్టే తనని లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. అభ్యంతకర వీడియోలో తాను లేనని, విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని చెప్పారు. ఏకలవ్యుడిని నిరాయుధుడిని చేసినట్టుగా తమ కులం వారిని అణగదొక్కేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.