రింగ్‌రోడ్డుకు ఇరువైపులా మొక్కలు పెంచితే, హైదరాబాద్ హరితనగరంగా మారుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. మంగళవారం జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన ఆయన.. ఔటర్‌రింగ్‌రోడ్డు ఆసాంతం పరిశీలించారు. ప్రత్యేక బస్సులో కండ్లకోయ నుంచి గచ్చిబౌలి, శంషాబాద్, బొంగ్లూరు, పెద్ద అంబర్‌పేట, ఘట్‌కేసర్ ప్రాంతాల గుండా సాగిన ముఖ్యమంత్రి.. ఔటర్ సుందరీకరణ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. నగరానికి మణిహారంగా నిలిచే రింగ్‌రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటడం ద్వారా రాజధానిని పచ్చలహారంగా మార్చవచ్చని అభిప్రాయపడ్డారు.