భీమవరం మండలం తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమం 25 గ్రామాలకు చెందిన వేలాది ప్రజలు చేపట్టినదనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రహించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఆ ఉద్యమాన్ని ఏ రాజకీయ పార్టీయో చేపట్టినది కాదని ఏ రాజకీయపార్టీయో లబ్ధికోసం చేపట్టిన ఉధ్యమం కాదని సిఎం చంద్రబాబు నాయుడు గమనించాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు. పాలకొల్లు కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ భవనం నందు ఈ నెల 19వ తేదీన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి తుందుర్రు తదితర గ్రామాల ప్రజలను కలిసి వారి భాదలు, ఇబ్భందులను తెలుసుకుని ఓదార్చడానికి వస్తున్న సందర్భంగా సోమవారం నిర్వహించిన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సమావేశానికి ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అధ్యక్షత వహించారు.