ఈరోజు నుంచి తన పాత్ర మారుతుందని, కొత్త పాత్ర పోషించబోతున్నానని ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఇష్టపూర్వకంగానే ఉపరాష్ట్రపతి ఎన్నికల పోటీలో నిలిచినట్టు వెల్లడించారు. తనకు మద్దతు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.