ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామానికి చెందిన 35 ఏళ్ల పెల్లేటి సుబ్బారెడ్డి గత అక్టోబర్ 2న రాత్రి జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. తక్షణం స్థానిక నారాయణ ఆస్పత్రిలో చేర్పించగా తీవ్రంగా గాయపడిన సుబ్బారెడ్డి బ్రెయిన్ డెడ్గా వైద్యులు ప్రకటించారు. చిన్నపాటి ప్రైవేటు పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సుబ్బారెడ్డి మరణం ఆ కుటుంబాన్ని దిక్కుతోచని స్థితిలో పడేసింది. రేపటి నుంచి కుటుంబం ఎలా గడవాలో తెలియని పరిస్థితి ఉన్నప్పటికీ ఆ కుటుంబం ఔదార్యం ప్రదర్శించి అవయవదానం చేయడానికి సిద్ధపడ్డారు.
Nov 12 2016 4:41 PM | Updated on Mar 21 2024 7:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement