దళితవాడల్లో దరిద్రాన్ని తరిమికొడదామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పిలుపు ఇచ్చారు. టిడిపి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ విజ్ఞప్తి మేరకు కెసిఆర్ సనత్ నగర్లోని ఐడిహెచ్ కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ అక్కడ ఇళ్లు శిథిలావస్థలో ఉన్నాయన్నారు. వెంటనే ఆ ఇళ్లను ఖాళీ చేయమని ఆయన దళితులను కోరారు. అయిదు నెలలలో సకల సదుపాయాలతో కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఇళ్ల నిర్మాణ పనులు రేపటి నుంచే ప్రారంభిస్తున్నట్లు కెసిఆర్ తెలిపారు.
Sep 1 2014 8:18 PM | Updated on Mar 21 2024 9:01 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement