ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ)లో తెలంగాణకు నంబర్ వన్ ర్యాంకు రావడం ఆషామాషీ వ్యవహారం కాదని.. దాని వెనుక 9 నెలల కష్టముందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు చెప్పారు. పారిశ్రామిక రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు ప్రవేశపెట్టడం.. అన్ని శాఖల మధ్య సయోధ్య, సమన్వయంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో ఐఏఎస్ అధికారులు అరవింద్‌కుమార్, నవీన్ మిట్టల్, శాంతికుమారి, అహ్మద్ నదీం, అనిల్‌లతో కలసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.‘‘తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో పెట్టుబడులు ఎలా వస్తాయి, రాష్ట్రం ఎలా ముందుకెళుతుందని చాలామంది సందేహం వ్యక్తం చేశారు. ఇప్పుడు తెలంగాణకు పారిశ్రామికంగా అగ్రస్థానం దక్కడంతో ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. సీఎం కేసీఆర్ పాలనా విధానం, రాష్ట్ర ప్రగతి తీరుకు దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో అవార్డులు వచ్చాయి’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
Nov 2 2016 7:29 AM | Updated on Mar 20 2024 5:24 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement