ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం

Published Tue, Jan 10 2017 10:17 AM

జమ్మూకశ్మీర్‌ బందిపొరా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మంగళవారం ఉదయం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఉగ్రవాది మృతి చెందగా, ఓ జవాను గాయపడ్డాడు. కాగా ఉగ్రవాదుల సంచరిస్తున్నారనే సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పొంచిఉన్న ఉగ్రవాదులు...భద్రతాదళాలపై కాల్పులు ప్రారంభించగా, ప్రతిగా జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు.

Advertisement
Advertisement