పూలకుండీల్లో గంజాయి సాగు.. | Man arrested, accused in illegal marijuana grow | Sakshi
Sakshi News home page

Jan 2 2017 6:41 PM | Updated on Mar 21 2024 8:18 PM

గంజాయిని పొలాల్లో సాగు చేస్తే అధికారులు పసిగడతారని ఓ వ్యక్తి కొత్త ఉపాయం కనిపెట్టాడు. తన ఇంట్లోని పూలకుండీల్లోనే సాగు చేసి దొంగచాటుగా విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుట్టురట్టు చేశారు. గోల్కొండలోని వైకే రెసిడెన్సీలో ఉండే సయ్యద్ అనే వ్యక్తి తన నివాసంలోనే పెద్దపూలకుండీలను ఏర్పాటు చేసుకుని గంజాయిని సాగు చేస్తున్నాడు. ఆపై దొంగచాటుగా విద్యార్థులకు, ఉద్యోగులకు విక్రయిస్తున్నాడు. గత కొంతకాలంగా ఈ తంతు కొనసాగుతోంది. దీనిపై విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సోమవారం దాడులు చేసి, సయ్యద్‌ను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి మొక్కలు సహా కుండీలను స్టేషన్‌కు తరలించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement