'అనంత'లో లాకప్ డెత్ ! | Lockup death in anantapur district | Sakshi
Sakshi News home page

Sep 11 2015 6:42 PM | Updated on Mar 21 2024 8:52 PM

అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి పోలీసుల అదుపులో చనిపోయాడు. చెన్నేకొత్తపల్లె మండలం ముష్టికోవెల పంచాయతీ గువ్వలగొందిపల్లెకు చెందిన బత్తెన శ్రీరాములు(54) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ముష్టికోవెల సమీపంలో జూలై 24వ తేదీన గుప్త నిధుల తవ్వకాలు జరిగాయి. ఆ కేసు విచారణలో భాగంగా పోలీసులు మాలక్కగారి సంజీవప్ప, తలారి సంజీవప్ప, రొద్దం ముత్యాలు, బత్తెన శ్రీరాములను మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement