రైతుల ఆత్మహత్యలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బుధవారం దద్దరిల్లింది. ప్రభుత్వ తీరును ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాక్ష్యాలతో సహా శాసనసభ సాక్షిగా ఎండగట్టారు. మంత్రి పుల్లారావు అబద్ధాలను ఆయన సభ దృష్టికి తెచ్చారు. రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీపై వాస్తవాలను వైఎస్ జగన్ సభలో వివరించారు.