వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ నేత, తెనాలి మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామ కృష్ణంరాజు నేడు వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్ జగన్ సమక్షంలో వారు పార్టీలోకి వచ్చారు. జగన్ వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరి అనుచరులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు భారీగా వీరు వైఎఎస్సార్ సీపీ పార్టీ ప్రధాన కార్యాలయానికి తరలివచ్చారు. రాష్ట్రానికి పూర్వవైభవం రావాలంటే జగన్తోనే సాధ్యమని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం రాష్ట్రానికి అవసరం ఉందని బాలశౌరి అంతకుముందు అన్నారు. రాష్ట్రానికి సరైన నాయకత్వం, దశ, దిశ చూపగలిగిన నాయకుడు ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే కృతనిశ్చయంతో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
Oct 13 2013 7:40 PM | Updated on Mar 21 2024 5:15 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement