పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని భూమ్‌నగర్‌లో హోంగార్డు సీహెచ్.సతీశ్(32) శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మారం మండలం మేడారం గ్రామానికి చెందిన సతీశ్ ధర్మారం ఠాణా నుంచి పెద్దపల్లికి రెండేళ్ల క్రితం వచ్చాడు. కొత్త జిల్లాల ఏర్పాటుతో హోంగార్డులను వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. ఈ క్రమంలో సతీశ్‌ను జగిత్యాల ఠాణాకు బదిలీ చేశారు. పెద్దపల్లి నుంచి రాకపోకలు సాగిస్తున్న సతీశ్ శుక్రవారం అక్కడ విధులు ముగించుకుని పెద్దపల్లికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారులు బదిలీ చేయడంతోనే ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు, మిత్రులు చెబుతున్నారు. పోలీస్ అధికారులు మాత్రం కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. సతీశ్‌కు భార్య మీన, కూతురు ఉంది. భార్యాభర్తల మధ్య తగాదాలు ముదిరి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. సీఐ మహేశ్ మృతదేహాన్ని సందర్శించారు.
Dec 25 2016 9:36 AM | Updated on Mar 21 2024 8:55 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement