అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం | Heavy hand of illegal structures | Sakshi
Sakshi News home page

Dec 14 2016 7:21 AM | Updated on Mar 21 2024 6:42 PM

అక్రమ నిర్మాణాలు, అనధికారిక లేఔట్లపై హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎం డీఏ) ఉక్కుపాదం మోపుతోంది. నెలరోజుల క్రితం నగరంలో కురిసిన భారీ వర్షాల ధాటికి 15 రోజుల పాటు ముంపులో చిక్కుకున్న నిజాంపేటలోని బండారి లేఔట్‌లోని అక్రమ నిర్మాణాలను హెచ్‌ఎండీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కూకటివేళ్లతో పెకిలిస్తున్నారు. తొలుత నాలా పరీవాహక ప్రాంతాల్లోని ఐదు అంతస్తుల ఏడు భవనాలు, 20 గేటెడ్‌ కమ్యూనిటీ విల్లాలను మంగళవారం కూల్చివేశారు. మరో 20 రోజుల్లో ఇక్కడ ఉన్న వందకుపైగా అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తామని అధికారులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement