ఈ సారి ఆస్పత్రికి వెళ్లినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి..! స్పెషాలిటీ కోర్సులో పీజీ చేసిన వైద్యుడు గ్రేస్ మార్కులతో పాసయ్యారా? లేక నిజంగానే కష్టపడి చదివి పాసయ్యారా? అనే విషయాన్ని తెలుసుకోండి. పీజీ పరీక్షలు పాస్ కాలేక.. అధికార పార్టీ అండదండలు, పలుకుబడితో వర్సిటీ అధికార యంత్రాంగాన్ని ప్రభావి తం చేసి.. దొడ్డిదారిలో గ్రేస్ మార్కులు సంపాదించి పాసైన డాక్టర్లతో కాస్త జాగ్రత్తగా ఉండండి.