మంత్రిపదవికి పినిపే విశ్వరూప్ చేసిన రాజీనామాను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శనివారం ఆమోదించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు రెండు రోజుల క్రితమే ప్రకటించిన విశ్వరూప్, ఆ మేరకు నేరుగా గవర్నర్ వద్దకు కూడా వెళ్లి రాజీనామా లేఖను ఆయనకే అందించిన విషయం తెలిసిందే. ఆయన విజ్ఞప్తి మేరకు విశ్వరూప్ రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పంపారు. రాష్ట్ర విభజనను ఉప సంహరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటన విడుదల చేయాలని సెప్టెంబర్ 7 తేదిన భీమవరంలో పినిపే విశ్వరూప్ డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేతల నుంచి రాజీనామాకు ఒత్తిడి పెరగడం, విభజనకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతోందనే వార్తల నేపథ్యంలో మంత్రి విశ్వరూప్ రాజీనామా తాజాగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Sep 28 2013 2:34 PM | Updated on Mar 21 2024 6:14 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement