కృష్ణా జలాల్లో గడిచిన రెండున్నరేళ్లుగా రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని పూడ్చు కునేందుకు వీలుగా.. ఏపీ చేసిన పాత వినియోగ లెక్కలన్నీ బయ టకు తీయాలని తెలంగాణ నిర్ణ యించింది. నీటి లోటును ఈ విధంగానైనా భర్తీ చేసుకోవచ్చనే అభిప్రాయంతో ఉంది. ప్రస్తుతం కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో 53 టీఎంసీల మేర నీటి లభ్యతే ఉండటం, అందులోనూ 18 టీఎంసీలకు మించి వాటా దక్కకపోవచ్చన్న అంచనా నేపథ్యంలో గతంలో ఏపీ చేసిన అధిక వినియోగ లెక్కలను తీసి వాటిని ఈ ఏడాది నీటిలో కొంతైనా సర్దుబాటు చేయిం చేలా కసరత్తు చేస్తోంది. దీనిపై గురువారం ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్ రావు, నీటి పారుదలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్, సాగర్ సీఈ సునీల్ ఇతర అధికారులతో చర్చలు జరిపారు.