గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే డీకే అరుణ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాను గద్వాల ఎమ్మెల్యేగా ఉన్నందుకే జిల్లాగా ప్రకటించడంలేదని చెబుతున్నారని, అందుకే తన పదవికి రాజీనామా చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు లేఖ రాశానని తెలిపారు.