స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ మంత్రి భాట్టం శ్రీరామమూర్తి (89) సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భాట్టం ఇవాళ ఉదయం మరణించారు. గతంలో ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేశారు. బాట్టం శ్రీరామమూర్తి 1926, మే 12న విజయనగరం జిల్లా ధర్మవరం గ్రామంలో జన్మించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కేబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు. భాట్టంకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కాగా భాట్టం మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.
Jul 6 2015 1:38 PM | Updated on Mar 21 2024 7:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement