పెద్ద నోట్ల రద్దుతో గ్రేటర్‌లోనే కాదు రాష్ట్రమంతటా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, ఖమ్మం ఇలా అన్ని జిల్లాల్లోనూ సామాన్యులు పెద్దనోట్లతో పాట్లు పడ్డారు. చేతిలో వంద నోట్లు లేక నానా ఇక్కట్లు ఎదుర్కొన్నారు.