మూడు రోజుల వరుస సెలవుల అనంతరం మంగళవారం తెరుచుకున్న బ్యాంకులకు ప్రజలు పరుగులు తీశారు. దీంతో బ్యాంకులు, ఏటీఎం సెంటర్లు కిక్కిరిసిపోయాయి. సెలవులు ముగిశాయన్న సంబరంలో ఏటీఎంలకు వెళ్లిన ప్రజలకు ఇప్పటికీ చాలా చోట్ల నో క్యాష్ బోర్డులు కనిపిస్తుండటంతో వారు నిరాశగా వెనుదిరుగుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక సామాన్యుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు.