రాష్ట్రంలో వెలుగుచూస్తున్న హవాలా మోసాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు స్పందించడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రశ్నించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్న విశాఖ, నేడు విజయవాడలో వెలుగు చూసిన హవాలా కుంబకోణాలపై చిత్తశుద్ది వుంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.