తమిళనాడు రాష్ట్రం సేలం నుంచి చెన్నై ఎగ్మూరుకు వస్తున్న రైలులో రూ.5.78 కోట్ల డబ్బును దొంగలు దోచుకెళ్లారని పోలీసులు తెలిపారు. చిరిగిపోయిన, 2005కు ముందు ముద్రించిన నోట్లను సేలం నుంచి చెన్నై ఆర్‌బీఐ (భారతీయ రిజర్వు బ్యాంకు) శాఖకు తరలిస్తుండగా దొంగతనం జరిగింది. ఈ నోట్ల మొత్తం విలువ రూ.340 కోట్లు కాగా దొంగలు రూ.5 కోట్లను ఎత్తుకెళ్లారు