కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంతనే తాను జన్మించానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు తెలిపారు. అందుకే రాజధాని నిర్మాణ బాధ్యత తనకు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం తిరమలలో నారా లోకేష్, బ్రహ్మాణీల తనయుడు దేవాన్ష్ అన్నప్రాసన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.