జగన్ విడుదలకు కోర్టు ఉత్తర్వులు జారీ | CBI nampally court issues Jagan mohan Reddy release order | Sakshi
Sakshi News home page

Sep 24 2013 3:28 PM | Updated on Mar 21 2024 7:50 PM

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదలకు నాంపల్లి సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విడుదల ఆర్డర్‌పై న్యాయమూర్తి దుర్గాప్రసాద్రావు మంగళవారం సంతకం చేస్తారు. కోర్టు సిబ్బంది ఆ ఉత్తర్వులను చంచల్‌గూడ జైలు అధికారులకు అందజేయనున్నారు. కోర్టు ఆదేశాల పరిశీలన తర్వాత... వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బయటకు వస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తవడానికి మరో రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి అయిదు గంటల మధ్యలో జగన్ మోహన్ రెడ్డి చంచల్గూడ జైలు నుంచి విడుదల కానున్నారు. జగన్ విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లు ఆయన తరపు న్యాయవాది అశోక్ రెడ్డి తెలిపారు. కోర్టు తెలిపిన అన్ని ష్యూరిటీలను అందచేసినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement