కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ శుక్రవారం తుది తీర్పు వెల్లడించింది. ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్కు ఎదురుదెబ్బే తగిలింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను ట్రిబ్యునల్ పక్కనపెట్టింది. తుంగభద్ర జలాల్లో నాలుగు టీఎంసీల అదనపు జలాల కేటాయింపు మాత్రమే పెంపుకు అనుమతి ఇచ్చింది. ఆర్డీఎస్కు నాలుగు టీఎంసీలను కేటాయించింది. రాష్ట్ర కేటాయింపులు 1001 నుంచి 1005 టీఎంసీలకు పెంచింది. ఒక బేసిన్ నుంచి మరో బేసిన్కు నీటిని తరలించవద్దని సూచించింది.