'రైతుల సమాధులపై రాజధాని సరికాదు'. | BJP leader Muralidhar Rao takes Chandra babu Government | Sakshi
Sakshi News home page

May 25 2015 8:20 PM | Updated on Mar 21 2024 10:59 AM

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం గురించి బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం రైతుల సమాధులపై రాజధాని నిర్మాణం చేపట్టడం సరికాదని మురళీధర రావు అన్నారు. అలాంటి రాజధాని నిర్మాణానికి బీజేపీ సహకరించదని వ్యాఖ్యానించారు. రాజధాని అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. మిత్రపక్షమైన బీజేపీ జాతీయ స్థాయి నేత రాజధాని నిర్మాణంపై విమర్శలు చేయడం టీడీపీకి ఇబ్బందికరమైన విషయం. చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేయడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement