రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్ర బంద్ జరుగనుంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆనాడు రాజ్యసభలో మన్మోహన్‌సింగ్, వెంకయ్యనాయుడు, అరుణ్‌జెట్లీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో పలు ప్రజా సంఘాలు, సీపీఐ రాష్ట్ర బంద్‌కు పిలుపిచ్చాయి. దీనికి అధికారపక్షం మినహా ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీతోపాటు వివిధ రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి.