వచ్చే నెలలో తెలంగాణ అసెంబ్లీ | Assembly next month | Sakshi
Sakshi News home page

Aug 19 2015 6:57 AM | Updated on Mar 21 2024 7:54 PM

వచ్చేనెల మొదటి వారం లేదా మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి తుది నిర్ణయం మేరకు ఈ తేదీలు ఖరారవుతాయని అధికార వర్గాలు వెల్లడించాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే సదస్సులో పాల్గొనేందుకు సెప్టెంబర్ 9న సీఎం కేసీఆర్ చైనా పర్యటనకు బయల్దేరనున్నారు. 14న ఆయన తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు. పారిశ్రామిక ప్రతినిధులు, పలువురు ఉన్నతాధికారులను వెంట బెట్టుకొని ప్రత్యేక విమానంలో సీఎం చైనా వెళ్లనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement