ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నిర్వహించనున్న గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ శుక్రవారం నుంచి ప్రారంభమవనుంది. కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.పీఎస్‌సీ.ఏపీ.జీఓవీ.ఐఎన్’లో ఆన్‌లైన్ దరఖాస్తును పొందుపర్చనున్నారు. దరఖాస్తులను శుక్రవారం నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు సమర్పించవచ్చు. ఇందుకు సంబంధించిన ఫీజును డిసెంబర్ 10వ తేదీ రాత్రి 11:59 నిమిషాల వరకు చెల్లించే వీలుంది.