ఈ ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో వీలైనంత ఎక్కువగా ఆదాయం ఆర్జించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఆదాయ వనరుల శాఖలకు జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు ఎంత ఆదాయం సంపాదించాలో లక్ష్యాలను నిర్దేశించింది. రాష్ట్ర సొంత పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా ఏకంగా రూ. 12,520 కోట్లను రాబట్టాలని ఆదేశాలిచ్చింది. ఇందులో వ్యాట్ ద్వారా అత్యధికంగా జనవరి నుంచి మార్చి వరకు రూ. 8,500 కోట్లు ఆర్జించాలని పేర్కొంది. వ్యాట్ ద్వారా డిసెంబర్ వరకు 21,232.43 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది.