ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు ముహూర్తం ఖరారైంది. బుధవారం నుంచి ఇది పట్టాలెక్కనుంది. విశాఖ వాసులు ఆశించినట్లుగానే ఇక్కడ నుంచే నడవనుంది. నేటి ఉదయం ఈ రైలును ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. 16 బోగీల ఈ ఏసీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం రాత్రి విశాఖ కోచింగ్ కాంప్లెక్స్ చేరుకుంది. గత బడ్జెట్‌లో విజయవాడ నుంచి బయలుదేరుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడి ఒత్తిళ్లకు రైల్వే బోర్డు తలొగ్గింది. విశాఖ నుంచే నడపాలని పచ్చజెండా ఊపింది. రైల్వే మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ఈ రైలును ప్రారంభించినట్టు ప్రకటిస్తారు. 14 నుంచి అధికారికంగా టికెట్లుజారీ అవుతాయయి. ప్రారంభోత్సవం రోజు జనరల్ టికెట్లు తీసుకున్న ప్రయాణికులకు రైలులో రిజర్వేషన్‌ఛార్జీ వసూలు చేస్తారు.