జీఎస్టీ బిల్లుకు ఏపీ కేబినేట్ ఆమోదం | AP cabinet approval of GST and commerical tax modify bill | Sakshi
Sakshi News home page

Sep 6 2016 3:50 PM | Updated on Mar 21 2024 7:46 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెట్టాల్సిన బిల్లులను మంత్రివర్గం ఆమోదించింది. విజయవాడలో మంగళవారం ఉదయం ఏపీ కేబినేట్ సమావేశం మూడు గంటల పాటు జరిగింది. ఈ సమావేశంలో కేబినేట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో వస్తు సేవా పన్నుల(జీఎస్టీ) బిల్లును ప్రవేశపెట్టానున్నారు. దీనితో పాటు కమర్షియల్ ట్యాక్స్ సవరణ బిల్లుకు కూడా కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ రెండు బిల్లులను అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించనున్నారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేసే వరకు స్పందించకూడదని ఏపీ కేబినేట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్లో గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న విషయం తెలిసిందే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement