రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా స్పష్టం చేశారు. శనివారం తాడేపల్లిగూడెంలో నిర్వహించిన రైతు మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రెండున్నర ఏళ్లలో అన్నివర్గాలు ప్రగతిపథంలో వెళ్లేందుకు బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రైతులు, గ్రామాల అభివృద్ధిపై మోదీ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, దీనిలో భాగంగానే మూడు దశాబ్దాల కాలంలో మూతపడిన ఎరువుల పరిశ్రమలను మళ్లీ తెరిపించారన్నారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా రైతులు నష్టపోతున్నారని, వీరిని ఆదుకునే ప్రయత్నం మోదీ వచ్చిన తర్వాతే జరిగిందన్నారు. ‘ప్రధాని ఫసల్ బీమా యోజన’ ద్వారా రైతు పంటకు భరోసా వచ్చిందన్నారు.
Nov 27 2016 7:19 AM | Updated on Mar 22 2024 10:49 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement