ఉత్తరప్రదేశ్ ఎన్నికల రాజకీయం సరికొత్త మలుపు తీసుకుంది. సమాజ్‌వాదీ పార్టీలో ముసలం మరింత ముదిరింది. ఏకంగా పార్టీ జాతీయాధ్యక్ష పదవి నుంచి ములాయంసింగ్ యాదవ్‌ను తప్పించి.. అఖిలేశ్ యాదవ్‌ను అధ్యక్షుడిగా నియమిస్తూ ఆ పార్టీ జాతీయ సమావేశం నిర్ణయం తీసుకుంది. ములాయం సోదరుడు శివపాల్ యాదవ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతోపాటు సీనియర్ నేత అమర్‌సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఇందుకు దీటుగా స్పందించిన ములాయం.. తానే ఎస్పీ జాతీయాధ్యక్షుడినంటూ ప్రతిచర్యలకు పూనుకున్నారు. పార్టీ జాతీయ సమావేశాన్ని నిర్వహించిన రాంగోపాల్ యాదవ్‌ను బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక పార్టీ యూపీ అధ్యక్షుడిగా నరేశ్ ఉత్తమ్‌ను అఖిలేశ్ నియమించగా... ములాయం నరేశ్ ఉత్తమ్‌ను కూడా పార్టీ నుంచి బహిష్కరించారు. మొత్తంగా యూపీ అసెంబ్లీ ఎన్నికలను మించి.. ఎస్పీలో కుటుంబ కలహాలు రోజుకో మలుపుతో తీవ్ర ఆసక్తి రేపుతున్నాయి. కుటుంబ కలహాలు కాస్తా పార్టీపై ఆధిపత్య పోరుగా మారడంతో తండ్రీ కొడుకుల మధ్య ఏ రోజు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
Jan 2 2017 8:15 AM | Updated on Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement