ఏర్పేడులో మరణ మృదంగం మోగింది. కన్నుమూసి తెరిచేలోగా 15 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. హాహాకారాలు, ఏడుపులు, రోదనలు మిన్నంటాయి. రక్తపు మడుగులో తడిసి ముద్దయిన అభాగ్యులు కొందరైతే, మాంసపు ముద్దలుగా మారి విగతజీవులైన వారు మరికొందరు. ఏర్పేడు పోలీస్‌స్టేషన్ ముందు శుక్రవారం భయానక వాతావరణం నెలకొంది. మృత్యువులా దూసుకొచ్చిన లారీ రైతులు, వ్యవసాయ కూలీలను పొట్టన పెట్టుకుంది.