ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన డిగ్రీ విద్యార్థిని భూక్యా మౌనిక(19) ఉదంతంలో మిస్టరీ వీడలేదు. ఆమె మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకువచ్చి పారిపోయిన ఇద్దరు అగంతకుల కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వారిలో ఒకరిని కూసుమంచి మండలం నాయకన్‌గూడెంకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు