'2017 జూలై నాటికి మెట్రో రైలు నిర్మాణం పూర్తి' | hyderabad-city-metro-rail-project-to-be-completed-by-july-5-2017-says-l-and-t-md-gadgil | Sakshi
Sakshi News home page

Jun 10 2015 3:40 PM | Updated on Mar 22 2024 11:07 AM

హైదరాబాద్ మెట్రో రైలు పనులు చకచక సాగుతున్నాయి. మరో రెండేళ్లలో మెట్రో రైలు నగర ప్రజలకు అందుబాటులోకి రానుందని మెట్రో రైలు నిర్మాణం చేస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ ఎండీ వి.బి.గాడ్గిల్ వెల్లడించారు. 2017 జూలై నెల నాటికి హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణం పూర్తవుతుందని ఆయన బుధవారం హైదరాబాద్లో వెల్లడించారు. అలాగే నగరంలో 18.5 మిలియన్ చదరపు అడుగుల కమర్షియాల్ మాల్స్ అభివృద్ధి చేస్తున్నట్లు గాడ్గిల్ వివరించారు. నగరంలోని జీహెచ్ఎంసీ, ఎల్ అండ్ టీ సంస్థ మధ్య ప్రకటనల విషయంలో ఎలాంటి వివాదం లేదని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ప్రస్తుతానికి రూ. 20 వేల కోట్లకు చేరుకుందని రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement