అందరూ ఊహించినట్టుగా రిలయన్స్ అధినేత సంచలన ప్రకటన చేశారు. జియో ఫోన్ భారతీయులందరికీ పూర్తిగా ఉచితమని రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సభ్య సమావేశం (ఏజీఎం)లో ముకేశ్ ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత చవకైన ఫీచర్ ఫోన్ లాంచ్ చేశామన్నారు. ఇండియాస్ ఇంటిలిజెంట్ ఫోన్ అంటూ అంబానీ వాయిస్ కమాండ్‌తో పనిచేసే ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు. ఉచిత వాయస్ కాల్స్, ఉచిత డేటా అంటూ సునామీ సృష్టించిన జియో ఇపుడిక జియో ఫోన్‌ఉచితమంటూ ప్రత్యర్థులు బాంబులు పేల్చింది.