కడప మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్‌గా తనను ఆశీర్వదించాలని బండి దీప్తిరెడ్డి కోరారు. సామాన్య కార్యకర్తనైన తనను మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మాజీ జెడ్పీ ఛైర్మెన్ కె. సురేష్ బాబులకు ధన్యవాదాలు తెలిపారు. తనను గెలిపిస్తే ప్రజలకు నిజాయితీగా సేవ చేస్తానని, నగరప్రజలకు మెరుగైన పారిశుధ్యం, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం కల్పించి మన్ననలు పొందుతానని తెలిపారు.


